పరిటాల సునీత వర్గీయుల దాష్టికం

Paritala Sunitha Supporters Brutally Attacked On YSRCP Workers - Sakshi

వేట కొడవళ్లతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. రామగిరి వైఎస్సార్‌సీపీ నేత బోయ సూర్యంపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో సూర్యంపై దాడి చేశారు. పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో ఈ ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌ డాడి చేయించారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  సోదరుడు తోపుదుర్తి చందు పరామార్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top