‘కేంద్ర మంత్రి పళ్లంరాజు రాజీనామా చేయాలి’ | pallam raju should be resigned, demands dwarampudi chandra sekharareddy | Sakshi
Sakshi News home page

‘కేంద్ర మంత్రి పళ్లంరాజు రాజీనామా చేయాలి’

Aug 18 2013 5:25 PM | Updated on May 29 2018 4:06 PM

కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాకినాడ: కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పళ్లంరాజు తన పదవికి రాజీనామా చేయాలని..లేకుంటే ఆమరణ దీక్ష చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీపై కూడా ఆయన మండిపడ్డారు. ఆంటోనీ కమిటీ వాదనలు చెప్పడం అంటే చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement