రేపటి నుంచి జిల్లాలో పీఏసీ పర్యటన | PAC tour of the district from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జిల్లాలో పీఏసీ పర్యటన

Aug 2 2015 2:47 AM | Updated on Sep 3 2017 6:35 AM

సాంబమూర్తినగర్ (కాకినాడ) : శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఈ నెల 3 నుంచి 5 వరకు జిల్లాలో పర్యటించనుంది

సాంబమూర్తినగర్ (కాకినాడ) : శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఈ నెల 3 నుంచి 5 వరకు జిల్లాలో పర్యటించనుంది. కమిటీ 3న మధ్యాహ్నం 12.25 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 1.40 గంటలకు రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి కాకినాడ వెళ్లి రాత్రికి అక్కడే బస చే స్తుంది. 4న ఉదయం   కాకినాడ నుంచి బయలుదేరి 10.40 గంటలకు వంతాడ, చింతలూరు గనులను పరిశీలించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు చింతలూరు నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుని రాత్రి బస చేస్తుంది.
 
  5న ఉదయం 9 గంటలకు కేఎస్‌ఈజడ్‌ను సందర్శించిన అనంతరం కాకినాడ చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో కేఎస్‌ఈజడ్‌కు సంబంధించిన భూమి వినియోగం, జీఆర్‌అండ్‌ఆర్ ప్యాకే అమలు అంశాలపై కలెక్టర్‌తో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రం, ఇతర విభాగాల అధికారులతో సమీక్షిస్తుంది. అలాగే వంతాడ, చింతలూరు గనుల తవ్వకాలపై సమీక్షిస్తుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కమిటీలో కొంతమంది సభ్యులు రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్ళనుండగా.. మరికొంతమంది రాత్రికి కాకినాడ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

Advertisement
 
Advertisement
Advertisement