పోలీసు స్టేషన్ ఎదుట ఉద్యోగి ఆత్మహత్యాయత్నం | Outsourcing employee suicide attempt at police station | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్ ఎదుట ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Aug 27 2014 9:10 AM | Updated on Aug 21 2018 9:20 PM

తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్ ఎదుట అటవీశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సుధాకర్ అర్థరాత్రి కలకలం సృష్టించాడు.

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్ ఎదుట అటవీశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సుధాకర్ అర్థరాత్రి కలకలం సృష్టించాడు. అకారణంగా తనపై ఎస్సీఎస్టీ కేసు పెట్టారంటూ ఫారెస్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధాకర్ అతడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులు సైతం న్యాయం చేయలేదంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దాంతో అతడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు.

సుధాకర్ పరిస్థితి విషమంగా ఉందని... మెరుగైన చికిత్స కోసం  మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సుధాకర్ భార్యకు సూచించారు. దాంతో సుధాకర్ స్వస్థలం ఏలూరు తీసుకువెళ్లాలని అతడి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.దాంతో సుధాకర్ను ఏలూరు తీసుకువెళ్తున్నారు. అయితే అలిపిరి పోలీసుల వేధింపుల వల్లే తన భర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సుధాకర్ బార్య హైమావతి ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement