ఒడిశాలో తీవ్ర ప్రభావం! | Orissa a huge impact! | Sakshi
Sakshi News home page

ఒడిశాలో తీవ్ర ప్రభావం!

Oct 12 2014 1:18 AM | Updated on Sep 2 2017 2:41 PM

హుదూద్ ప్రభావం ఒడిశాలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై గంజాం,

సహాయ కార్యక్రమాలు ప్రారంభం
 
భువనేశ్వర్ (ఒడిశా): హుదూద్ ప్రభావం ఒడిశాలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై  గంజాం, గజపతి, మల్కన్‌గిరి, కొరాపుట్ జిల్లాల  అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుపాను పరిస్థితిపై కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి మేరకు ఐదు హెలికాప్టర్లను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలను ఒడిశా ప్రభుత్వం ప్రారంభిం చింది.

రాష్ట్రం మీదుగా వెళ్లే రెండు విమానాలు, 39 రైళ్లు రద్దయ్యూరుు. కోరాపుట్, మల్కాన్‌గిరి, నవరంగ్‌పూర్, రాయగడ, గజపతి, గంజాం, కల హండి, కాంధమాల్ జిల్లాల కలెక్టర్లు ప్రజలను తరలించే విధుల్లో నిమగ్నమైనట్టు ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె.మొహాపాత్ర చెప్పారు. సుమారు 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement