కొనసాగుతున్న సెలక్షన్స్ | Ongoing constable Selections | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సెలక్షన్స్

Dec 4 2016 2:42 AM | Updated on Mar 10 2019 8:23 PM

కొనసాగుతున్న సెలక్షన్స్ - Sakshi

కొనసాగుతున్న సెలక్షన్స్

పోలీస్ కానిస్టేబుళ్ల ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో మూడోరోజు శనివారం 730 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, 1,600 మీటర్ల పరుగు,

కానిస్టేబుళ్ల ఎంపికలో మూడో రోజు అర్హత సాధించిన 730 మంది
1,200 మందికి 1,115 మంది హాజరు
నేడు 425 మంది మహిలు.. 800 మంది పురుషులకు పరీక్షలు

ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ల ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో మూడోరోజు శనివారం 730 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌ల్లో పోటీల అనంతరం మూడో దశ అయిన  రాత పరీక్షకు అర్హత సాధించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ పర్యవేక్షించారు. పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డన్ల రెండో దశ ఎంపికకు సంబంధించి 1,200 మంది హాజరుకావాల్సి ఉంది. అరుుతే 1,115 మంది హాజరయ్యారు.

మొదట నిర్వహించే ఫిట్‌నెస్ మెజర్‌మెంట్ పరీక్షలో భాగంగా ఎత్తు, ఛాతీ కొలతల్లో 182 మంది అనర్హత పొందారు. దీంతో 933 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 124 మంది అనర్హత పొందారు. ఇక 100 మీటర్ల పరుగు పోటీలకు, లాంగ్ జంప్ పోటీలకు 809 మంది అర్హత సాధించినట్లయింది. 100 మీటర్లు, లాంగ్ జంప్ పోటీల్లో 79 మంది అనర్హత పొందారు. ఆదివారం 425 మంది మహిళా అభ్యర్థులతో పాటు 800 పురుషులు హాజరు కావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement