పాసర్లపూడిలంకలో గ్యాస్ పైప్ లీకు | ONGC Gas pipe leaks in Pasarlapudi lanka village | Sakshi
Sakshi News home page

పాసర్లపూడిలంకలో గ్యాస్ పైప్ లీకు

Jul 31 2015 7:08 PM | Updated on Sep 3 2017 6:31 AM

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలంక గ్రామంలో ఒఎన్‌జీసీ సంస్థకు చెందిన గ్యాస్ పైపు లైన్ లీకైంది.

మామిడికుదురు (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలంక గ్రామంలో ఒఎన్‌జీసీ సంస్థకు చెందిన గ్యాస్ పైపు లైన్ లీకైంది. శుక్రవారం పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది.

గ్రామంలోని 18 వ బావి వద్ద ఉన్న గ్యాస్ పైపు లైన్ పేలడంతో కొద్దిగా ముడిచమురుతో పాటూ, గ్యాస్ కూడా లీకైంది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన ఒఎన్‌జీసీ సంస్థ అధికారులు పైప్‌లైన్‌ను బాగుచేసేందుకు వెళ్లారు. కాగా భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఒఎన్‌జీసీ అధికారులను నిర్బంధించారు.

Advertisement
 
Advertisement
Advertisement