అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనలో టీడీపీ నేత పై కేసు నమోదు చేశారు.
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వెంకటేశ్ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనలో టీడీపీ నేత పై కేసు నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో వెంకటేశ్ ను శుక్రవారం వేటకొడవళ్లతో నరికి అతి కిరాతకంగా చంపేశారు. ఈ హత్యపై అనుమానం ఉన్న స్థానిక టీడపీ నేత ప్రతాప్ నాయుడు సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరో వైపు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సోదరుడు శీనప్ప ఈ హత్య చేయించారని మృతుడి సోదరుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.