ఒకే ఒక్కడు.. ముప్పు తెచ్చాడు! 

One Man Spread Coronavirus In East Godavari District - Sakshi

ప్రభుత్వం ఎంత చెబుతున్నా అదే నిర్లక్ష్యం

కరోనా తీవ్రతను గుర్తించని జనం

అప్రమత్తం కాని వైనం

జి.మామిడాడలో కేసులకు ఇదే కారణం

రెండు రోజుల్లో 29 మందికి పాజిటివ్‌

అన్నీ మృతుడి కాంటాక్టులేనని తేల్చిన అధికారులు  

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది చెవికెక్కించుకోవడం లేదు. అవగాహనా రాహిత్యమో, ‘మనకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్యమో కానీ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో జిల్లాలోనే కరోనా తొలిసారిగా పాజిటివ్‌ కేసు నమోదైనప్పటి నుంచీ గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం పదేపదే చెబుతూనే ఉంది. కానీ ఆ మాటలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలకు వెళ్లకుండా రోగాన్ని దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు జిల్లాను భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. ఇలా రోగాన్ని దాచిపెట్టి నాడు కత్తిపూడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తాజాగా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన హోటల్‌ క్యాషియర్‌ (ఫొటోగ్రాఫర్‌ కూడా) ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!)

కత్తిపూడిలో ఉపాధ్యాయుడు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మృత్యువు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డాడు. ఆ ఉపాధ్యాయుడు కరోనా లక్షణాలపై గోప్యత పాటించి పలువురికి పాజిటివ్‌ రావడానికి కారణమయ్యాడు. తాజాగా తొలి కరోనా మరణం నమోదైన గొల్లల మామిడాడలో కూడా కత్తిపూడి తరహా పరిణామమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గొల్లల మామిడాడలో హోటల్‌ క్యాషియర్‌ మృతి చెందాక కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఆ కేసుతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులన్నీ కలిపి గడచిన 48 గంటల్లో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకేసారి రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జి.మామిడాడ, పరిసర గ్రామాల్లో సుమారు 500 మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి )

మరింతమందికి నిర్వహిస్తోంది. జి.మామిడాడ, బిక్కవోలు, రామచంద్రపురంలో నమోదైన కేసులన్నీ మృతి చెందిన వ్యక్తితో కాంటాక్ట్‌ అయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అతడికి ఆస్తమా లక్షణాలున్నట్టు భావించి, కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేసిన నలుగురు హౌస్‌ సర్జన్లను, పదిమంది మెడికోలను క్వారంటైన్‌కు తరలించారు. మరణించిన ఆ వ్యక్తితో కాంటాక్ట్‌ అయిన వారి సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది.  మృతుడు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొంది ఉంటే ఇప్పుడు ఇంతమందికి వైరస్‌ వ్యాప్తి చెంది ఉండేది కాదని, వారందరికీ ముప్పు తప్పేదని వైద్యులు అంటున్నారు. (విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి)

ఉలిక్కిపడిన మామిడాడ 
కరోనా వ్యాప్తి మొదలైన తరువాత జిల్లాలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఇన్ని కేసులు వెలుగులోకి రావడంతో గొల్లల మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. సుమారు 20 వేల జనాభా కలిగిన మేజర్‌ గ్రామ పంచాయతీ గొల్లల మామిడాడ. నిత్యం వందలాదిగా జనంతో రద్దీగా ఉండే మామిడాడ నాలుగు రోడ్ల కూడలిలోని గాం«దీ»ొమ్మ సెంటర్‌లో ఉన్న హోటల్‌కు మంచి పేరు ఉంది. దీంతో స్థానికులు ఎక్కువ మంది అక్కడికే వెళ్తూంటారు. ఆ హోటల్‌లో పని చేసే క్యాషియర్‌ మృతి చెందిన తరువాత కరోనా నిర్ధారణ కావడంతో మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఆ పరిసర గ్రామాల నుంచి 213 మంది పరీక్షలు చేయించుకున్నారు. (వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌)

శనివారం కూడా అదే తరహాలో సుమారు 270 మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారిని అన్ని వసతులూ ఉంటే హోం ఐసోలేషన్‌ లేదా హోం క్వారంటైన్‌కు అవకాశం కలి్పస్తూ జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. జి.మామిడాడలో మరణించిన వ్యక్తికి పాజిటివ్‌ అని జీజీహెచ్‌లో నిర్థారించినప్పటి నుంచి అతడితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల కోసం గ్రామ వలంటీర్లు, ఆశ వర్కర్లు, వైద్యులు అనపర్తి నియోజకవర్గంలో జల్లెడ పట్టారు. అనుమానితులను గుర్తించడం, వారందరినీ అప్రమత్తం చేసి వైద్య పరీక్షలకు తీసుకురావడంలో వైద్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

15-07-2020
Jul 15, 2020, 07:08 IST
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 6 జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులున్నాయి. నగరంలో కోవిడ్‌– 19 కేసుల...
15-07-2020
Jul 15, 2020, 06:32 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్‌ ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న...
15-07-2020
Jul 15, 2020, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో ఆక్సిజన్‌ సిలిండర్లకు కొరత ఏర్పడింది. మున్ముందు అవసరం అవుతుందన్న భావనతో అనేక మంది ముందస్తుగా...
15-07-2020
Jul 15, 2020, 04:29 IST
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, దక్షిణ చైనా సముద్రం విషయమై అమెరికా–చైనాల మధ్య తాజాగా ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లతో...
15-07-2020
Jul 15, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు 12 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 11,95,766 టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర...
15-07-2020
Jul 15, 2020, 03:50 IST
వాషింగ్టన్‌: కోవిడ్‌ –19 కబంధ హస్తాల్లో చిక్కుకొని అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతుంటే అక్కడ యువతరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. కరోనా పార్టీలు...
15-07-2020
Jul 15, 2020, 03:05 IST
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్‌ కరోనా పాజిటివ్‌తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి...
15-07-2020
Jul 15, 2020, 02:00 IST
సాక్షి, హైదరాబాద్ ‌: మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు...
15-07-2020
Jul 15, 2020, 01:44 IST
సాక్షి, హైదరాబాద్ : ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన రెండు సెషన్‌లు చాలని, ప్రీప్రైమరీ తరగతులకు...
14-07-2020
Jul 14, 2020, 20:47 IST
సాక్షి, హైద‌రాబాద్ : గాంధీ ఆసుప‌త్రిలో దారుణం చోటుచేసుకుంది. క‌రోనా సోకి మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీనివాస్ అనే రోగి చ‌నిపోయాడు....
14-07-2020
Jul 14, 2020, 17:28 IST
దేశం ఇంకా సామాజిక‌ వ్యాప్తి ద‌శ‌కు చేరుకోలేద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి స్ప‌ష్టం చేశారు.
14-07-2020
Jul 14, 2020, 16:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలు దాటినప్పటికీ రికవరీ రేటు కూడా పెరగడం ఊరటనిచ్చే...
14-07-2020
Jul 14, 2020, 14:11 IST
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, డాలరు బలం,  ఈక్విటీల భారీ నష్టాల...
14-07-2020
Jul 14, 2020, 13:14 IST
లండన్: కరోనాతో ప్రపంచం అంతా కకావికలమవుతోంది. ఈ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. సరైన వైద్యం కూడా లేదు....
14-07-2020
Jul 14, 2020, 12:14 IST
సాక్షి, కోల్‌కతా: కరోనా మహమ్మారి మరో సీనియర్‌ అధికారిని పొట్టన పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పనిచేసి విశేష...
14-07-2020
Jul 14, 2020, 11:03 IST
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభింస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చాలా...
14-07-2020
Jul 14, 2020, 10:53 IST
బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే అమితాబ్‌ బచ్చ‌న్ కుటుంబంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. అంతేకాకుండా ప్ర‌ముఖ...
14-07-2020
Jul 14, 2020, 10:10 IST
ఒడిశా ,బరంపురం: గంజాం జిల్లాలోని కుకుడాఖండి సమితి పరిధిలో ఉన్న  జొగియాపల్లి గ్రామంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన...
14-07-2020
Jul 14, 2020, 09:14 IST
తూర్పుగోదావరి,పిఠాపురం: చంటి పిల్లల వైద్యుడికి కరోనా సోకినట్టు తేలడంతో పిఠాపురం పరిసర గ్రామాల్లో ఆందోళన రేగింది. పిఠాపురం నియోజకవర్గంతో పాటు...
14-07-2020
Jul 14, 2020, 09:07 IST
సాక్షి, ముంబై:  కరోనా మహమ్మారి  అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top