లారీ - కారు ఢీ: ఒకరు మృతి | One killed, three injured in road accident chittoor district | Sakshi
Sakshi News home page

లారీ - కారు ఢీ: ఒకరు మృతి

Nov 20 2014 12:09 PM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల వద్ద లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల వద్ద లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement