డివైడర్ను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి | One killed in road accident in vizag | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

Feb 6 2016 11:38 PM | Updated on Aug 30 2018 3:58 PM

పెద్దరిషికొండ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డివైడర్ను ఢీకొట్టింది.

విశాఖపట్నం : పెద్దరిషికొండ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement