వంద కిలోల గంజాయి స్వాధీనం | One Hundred kg Of Marijuana Seized In Madugula | Sakshi
Sakshi News home page

వంద కిలోల గంజాయి స్వాధీనం

Jun 21 2018 12:30 PM | Updated on Jun 21 2018 12:34 PM

One Hundred kg Of Marijuana Seized In Madugula - Sakshi

నిందితులతో ఎస్‌ఐ సునీల్‌కుమార్, సిబ్బంది 

చీడికాడ(మాడుగుల) : మండలంలోని కోనాం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వద్ద  బుధవారం వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని,  14 మందిని  అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ఎల్‌.శిరీష్‌కుమార్‌  తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోనాం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సమీపంలో కొందరు అపరిచితులు బ్యాగులతో ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో   దాడి చేశారు. అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రం ఎన్నూరు జిల్లాకు చెందిన రాజకుమార్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి జి.మాడుగుల మండలం ఆగంపాడుకు చెందిన అన్నదమ్ములు గండేరి మత్య్సలింగం,గండేరి రవిబాబును గంజాయి కోసం సంప్రదించాడు.  వంద కిలోల గంజాయిని సమకూర్చి, దానిని తరలించేందుకు  జి.మాడుగుల సంతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  11 మందిని ఏర్పాటు చేశాడు. ఒకొక్కరికీ రూ.వెయ్యి కూలి ఇచ్చేందుకు నిర్ణయించి, వారికి విద్యార్థులు వినియోగించే 13 బ్యాగుల్లో ఒక్కొక్కదానిలో ఆరు కిలోల చొప్పన ఉంచి ఇచ్చారు. మరో  రెండు గోనే సంచుల్లో ఒక్కొక్క సంచిలో 17 కిలోలు చొప్పున 34 కిలోలు ఉంచి తరలిస్తున్నారు. ఈ గంజాయి విలువ రూ. రెండు లక్షలు ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు.  కేసునమోదు చేసి నిందుతులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement