కుటుంబానికి ఒక్కటే... | one family to one pension | Sakshi
Sakshi News home page

కుటుంబానికి ఒక్కటే...

Oct 11 2014 3:38 AM | Updated on May 25 2018 6:14 PM

ఒక కుటుంబానికి ఒకటే పెన్షన్ అని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశా రు.

- జన్మభూమి సభలో పెన్షన్‌లపై స్పష్టత ఇచ్చిన కలెక్టర్  
లొట్లపల్లి (జామి): ఒక  కుటుంబానికి ఒకటే పెన్షన్ అని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశా రు. జామి మండలంలోని లొట్టపల్లిలో శుక్రవారం జరిగిన జన్మభూమి-మాఊ రు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రసుత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారం  కుటుంబానికి ఒకటే పెన్షన్ వస్తుందన్నా రు. ప్రభుత్వ నిబంధనల్లో తరువాత  మార్పులు వస్తే పరిశీలిస్తామని చెప్పారు.

పెన్షన్ల పంపిణీలో జాప్యం ఎందుకవుతోందని  ఎంపీడీఓ ఎన్‌ఆర్‌కె.సూర్యాన్ని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ టెక్నికల్ సమస్యల వల్ల ఆధార్ నంబరు అనుసంధానం కాకపోవడంతో  ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పా రు. దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం  చేశారు. ఈ విషయంలో డీఆర్‌డీఏ, స్మార్ట్ కార్డుల అధికారులతో మాట్లాడి  బాధ్యులైన వారికి షోకాజ్ నోటీసులు  జారీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.  

అర్హత కలిగి ఉన్నప్పటికీ నిరుపేదల పెన్షన్లు తొలగించారని గ్రామానికి చెందిన కొంతమంది  మహిళలు కలెక్టర్ ఎదుట వాపోయారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు తమ పెన్షన్లు  కూడా తొలగించారని  కలెక్టర్‌కు ఫిర్యాదు  చేశారు. తొలగింపులపై మళ్లీ విచారణ జరిపి అర్హత ఉంటే తప్పనిసరి గా పరిష్కారం చేస్తామని ఫిర్యాదు దారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు  నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. దీనిపై  గ్రామస్తుల నుంచి ఎన్ని దరఖాస్తులు  వచ్చాయని అడగంతో అధికారులు దరఖాస్తులు తీసుకుంటామని సమాధానమివ్వగా కలెక్టర్ మండిపడ్డారు.

తాను మళ్లీ ఈ గ్రామానికి  వస్తానని, ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుని కనిపించాలని అధికారులను హెచ్చరించారు. ఎంపీడీఓ, ఉపాధి తదితర శాఖల సిబ్బంది సం యుక్తంగా మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం లో జన్మభూమి ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి ఆదిత్యలక్ష్మి, ఎంపీడీఓ ఎన్‌ఆర్‌కె.సూర్యం, జెడ్‌పీటీసీ బండారు  పెదబాబు, సర్పంచ్  జన్నేల సింహాచలం, ఎంపీటీసీ కడియా ల గోపి,  అన్నిశాఖల అధికారులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement