కారు బోల్తా : ఒకరి మృతి | one dies in Road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ఒకరి మృతి

May 21 2015 6:21 PM | Updated on Sep 3 2017 2:27 AM

కారు బోల్తా పడి ఒకరు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అల్లుంగుండు రహదారిపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

కర్నూలు : కారు బోల్తా పడి ఒకరు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అల్లుంగుండు రహదారిపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లాకు చెందిన మురళి(30)  కారులో కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అల్లుంగుండు సమీపానికి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వెనుక కూర్చుని ఉన్న మురళి అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement