breaking news
	
		
	
  car over turn
- 
      
                    
కారు బోల్తా : ఒకరి మృతి

 కర్నూలు : కారు బోల్తా పడి ఒకరు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అల్లుంగుండు రహదారిపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లాకు చెందిన మురళి(30) కారులో కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అల్లుంగుండు సమీపానికి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వెనుక కూర్చుని ఉన్న మురళి అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. - 
      
                    
మానవపాడులో కారు బోల్తా

 మహబూబ్‌నగర్ (మానవపాడు): మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. 


