ప్రాణం తీసిన ప్రేమ వివాదం | one died in vizianagaram group fight over love issue | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ప్రేమ వివాదం

Feb 25 2017 7:26 PM | Updated on Sep 5 2017 4:35 AM

ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో నిమ్మల సారంగి(68) బీపీకి గురై మృతిచెందాడు.

గుమ్మలక్ష్మీపురం : ప్రేమ వివాహానికి సంబంధించి తాడికొండ గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో నిమ్మల సారంగి(68) బీపీకి గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎల్విన్‌పేట ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు...తాడికొండ గ్రామానికి చెందిన పాలక మహేంద్ర అనే యువకుడు అదే గ్రామానికి చెందిననిమ్మక దివ్యను ప్రేమ పేరిట మూడు నెలల కిందట గ్రామం నుంచి తీసుకుపోయాడు. అప్పట్లో దివ్య తల్లిదండ్రులు మహేంద్ర తల్లిదండ్రులను నిలదీశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం నెలకొంది.

ఈ క్రమంలో మహేంద్ర తల్లిదండ్రులు పాలక రామా రావు, సులోచనలు దివ్యను తీసుకువస్తామని చెప్పి మూడు నెలల కిందట గ్రామం నుంచి వెళ్లారు. తరువాత శుక్రవారం మహేంద్ర తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు వారింటికి వెళ్లి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుని కేకలు వేసుకున్నారు. ఈ దశలో దివ్య పెద్దనాన్న నిమ్మల సారంగి(60) పెద్దగా కేకలు వేయడంతో రక్తపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్పందించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement