ఆటో బోల్తా మాజీ సర్పంచ్ మృతి | one died in auto accident in kurnool district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా మాజీ సర్పంచ్ మృతి

Nov 1 2015 1:24 PM | Updated on Sep 3 2017 11:50 AM

కర్నూలు జిల్లాలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఎర్రకోట నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఎర్రకోటకు చెందిన మాజీ సర్పంచ్ మేనకమ్మ(50) మృతిచెందడంతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement