ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు, ఒకరి మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు, ఒకరి మృతి

May 22 2015 7:28 AM | Updated on Sep 29 2018 5:26 PM

ఓ ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు.

కడప (ఖాజీపేట): ఓ ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మైదుకూరు మండలం బి. కొత్తపల్లి గ్రామానికి చెందిన కొన్నయ్య(60) ట్రాక్టర్‌పై కడపకు వెళుతుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తోన్న కొన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement