వృద్ధ దంపతుల దారుణహత్య | Older couple brutally murdered | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల దారుణహత్య

Jan 5 2016 6:10 PM | Updated on Sep 3 2017 3:08 PM

పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు.

పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన వెంకటప్పయ్య(75), వెంకట రామమ్మ(65) అనే దంపతులను ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపారు. ఘటన అనంతరం వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement