అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతిచెందాడు.
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతిచెందాడు. ఎర్రగుంట గ్రామానికి చెందిన పెద్ద వన్నూర్ సాబ్ బైక్‌పై పొలానికి వెళుతుండగా వెనుక వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో వన్నూర్‌సాబ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బళ్లారి- కణేకల్లు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన ఏపీ 26 ఏఎఫ్ 6768 నంబరు గల ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నామని, ఆ కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని కణేకల్లు ఎస్‌ఐ యువరాజు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన మీడియాకు వివరించారు.
(కణేకల్లు)