అధికారుల దాడులు | officers attacks on sand mafia | Sakshi
Sakshi News home page

అధికారుల దాడులు

Jan 20 2014 4:11 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియాపై ఆదివారం అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల మండలం గోదావరి తీరం నుంచి అనుమతి, పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న 17 లారీలను పట్టుకుని పోలీసులు జరిమానా విధించారు.

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియాపై ఆదివారం అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల మండలం గోదావరి తీరం నుంచి అనుమతి, పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న 17 లారీలను పట్టుకుని  పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 10వ తేదీన సాక్షిలో ‘తోడేస్తున్నారు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఇసుక మాఫియా రవాణాను కొద్ది రోజులు నిలిపి వేసింది.

మళ్లీ ఆదివారం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంపూర్‌లోని సింగాపూర్ వద్ద గల గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. గతంలో రాత్రుళ్లు మాత్రమే ఇసుకను రవాణా చేసిన అక్రమార్కులు ఆదివారం ఉదయం అనుమతులు లేకుండా, ఓవర్‌లోడ్‌తో అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు వాహనాలను తనీఖీ చేయగా, అనుమతి పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement