అటకెక్కిన ఎన్టీఆర్‌ వైద్య సేవలు..

NTR Health Scheme Stops in Hospitals YSR Kadapa - Sakshi

సమ్మె బాట పట్టిన నెట్‌ వర్కింగ్‌ హాస్పిటల్స్‌

పూర్తిగా నిలిచిపోయిన ఓపీ, సాధారణ సేవలు

కడప రూరల్‌: జిల్లాలో ఎన్టీఆర్‌ వైద్య సేవల (ఆరోగ్య శ్రీ) నెట్‌ వర్కింగ్‌ హాస్పిటల్స్‌ యజమానులు ‘ఆశా’ అసోసియేషన్‌ పిలుపు మేరకు సమ్మె బాట పట్టారు. ఫలితంగా గురువారం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి.  జిల్లా వ్యాప్తంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవలతో పాటు ఆరోగ్య రక్ష, ఎంప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌), వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం (డబ్ల్యూజేహెచ్‌ఎస్‌)ల కింద వైద్య సేవలను  అందించే ఆసుపత్రులు  23 ఉండగా..అందులో ప్రభుత్వ రంగానికి సంబంధించినవి కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, రాజంపేటలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఉన్నాయి.  23 హాస్పిటల్స్‌లో మూడింటిని మినహయిస్తే మిగతా 20 ప్రైవేట్‌ ఆసుపత్రులు వైద్య సేవలను నిలుపుదల చేశాయి. ఈహెచ్‌ఎస్, డబ్ల్యూజేహెచ్‌ఎస్‌ పథకాల కింద దంత వైద్య సేవలను అందించే హాస్పిటల్స్‌ జిల్లాలో 25 ఉన్నాయి.ఇవి సమ్మెలో పాల్గొనడంలేదు. త్వరలో  సమ్మె బాట పట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు  సమాచారం.

ఈ స్కీంలో  సోమ, మంగళ, బుధవారాల్లో ఒక్కో హాస్పిటల్‌కు ఔట్‌ పేషెంట్స్, రోజుకు దాదాపు  వంద మంది  వస్తుంటారు. సాధారణ రోజుల్లో 50 మంది వస్తారు. ఇన్‌ పేషెంట్స్‌ రోజుకు 10 మంది  చేరుతుంటారు.  సమ్మెలో భాగంగా ఈ ఓపీ, సాధారణ వైద్య సేవలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. దీంతో  రోగులు వెనుతిరిగిపోతున్నారు.  ఆరోగ్య శ్రీ కింద మా హాస్పిటల్‌కు దాదాపు రూ 2 కోట్లకు పైగా బకాయిలు రావాలి. ఇవి రాకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ గగనంగా మారుతోందని పేరు చెప్పడాకి ఇష్టపడని వైద్యులు అంటున్నారు. కాగా కడప నగరంలో ఉన్న 11 హాస్పిటల్స్‌ మాత్రమే వైద్య సేవలు నిలుపుదల చేశాయని మిగతావి యథావిధిగా పనిచేస్తున్నాయని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కో ఆర్టినేటర్‌ డాక్టర్‌ శివనారాయణ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top