కనికరం చూపని ముఖ్యమంత్రి

Now working for your welfare says chandrababu - Sakshi

వృద్ధురాలిని నిర్దయగా పక్కకు నెట్టేసిన సీఎం చంద్రబాబు నాయుడు

యూనివర్సిటీ క్యాంపస్‌(తిరుపతి)/గుంటూరు రూరల్‌: ‘‘ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను గతంలోలాగా కాదు. ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా  పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే 30 జీవోలు జారీ చేశాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో శనివారం సీఎం మాట్లాడారు.

ఈ–ఆఫీస్‌ అమలులోకొచ్చాక పాలనలో జవాబుదారీతనం పెరిగిందని.. ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసే సౌలభ్యముందని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగులు కార్యాలయాలకొచ్చి పనిచేయాలని కోరారు. అప్పుడప్పుడూ ఆలస్యంగా వచ్చినా పట్టించుకోనన్నారు. ఉద్యోగులకు 10వ పీఆర్‌సీకి సంబంధించి రావాల్సిన అరియర్స్, 11వ పీఆర్‌సీ అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. 

వృద్దురాలు అని కూడా చూడకుండా
వృద్ధురాలు అనగానే ఓపికగా కాసేపు సమయం కేటాయించి ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వృద్ధురాలిని నిర్దయగా పక్కకు నెట్టేశారు. తిరుపతి సమీపంలోని తనపల్లె వద్ద శనివారం గృహనిర్మాణ సముదాయాలను ప్రారంభించేందుకు వచ్చిన బాబుకు తన కష్టం చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. సీఎంను చూసి నమస్కరించింది. తన సమస్య చెప్పేలోపే బాబు ఆమె వైపు కోపంగా చూస్తూ ఓ చేత్తో ఆమెను  నెట్టేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు కంటతడితో వెనుదిరిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top