
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ సర్పంచి ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ జారీ కానుంది. మొత్తం 13,207 గ్రామ పంచాయతీల్లో 6,286 చోట్ల మొదటి విడతలో, 6,921 చోట్ల రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 17–19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో 6,921 గ్రామాలలో 17వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. 19–21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు.