టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల | No Vivek's impact on TRS: Etela Rajender | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల

Mar 31 2014 5:33 PM | Updated on Sep 2 2017 5:24 AM

టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల

టీఆర్ఎస్ పై వివేక్ ప్రభావం ఉండదు: ఈటెల

ఎన్నికల ముందు వలసలు సాధారణమేనని టీఆర్ఎస్ పార్టీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్: ఎన్నికల ముందు వలసలు సాధారణమేనని టీఆర్ఎస్ పార్టీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎంపీ వివేక్ వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండదు అని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, జేఏసీ వాదులతో కలిసి వెళ్లాలని అనుకుంటున్నామని ఈటెల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివేక్ తోపాటు మరికొంత మంది ఎంపీలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
 
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మరో ఎంపీ మందా జగన్నాథం తాను పార్టీ వీడే ప్రస్తక్తి లేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే దళితులకు న్యాయం జరుగుతుందని.. ఆ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్ని త్యాగాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని ఆయన విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement