వీహెచ్ కు చేదు అనుభవం | No permission to V.Hanumanta Rao at LB Stadium | Sakshi
Sakshi News home page

వీహెచ్ కు చేదు అనుభవం

Apr 25 2014 5:54 PM | Updated on Sep 2 2017 6:31 AM

వీహెచ్ కు చేదు అనుభవం

వీహెచ్ కు చేదు అనుభవం

గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్‌)కు చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్: గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వి. హనుమంతరావు(వీహెచ్‌)కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా వేదికపైకి పంపడానికి పోలీసులు నిరాకరించారు.
 
ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్ కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్‌ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్ కు అనుమతించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement