`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే` | No new party of kiran kumar reddy, says kondru murali | Sakshi
Sakshi News home page

`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే`

Dec 31 2013 2:31 PM | Updated on Jul 29 2019 5:31 PM

`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే` - Sakshi

`ఆయన కొత్త పార్టీ ఊహజనితమే`

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతో దశాబ్ధాల అనుబంధం ఉందని, ఆయన కొత్త పార్టీ పెట్టడం ఊహజనితమేనని మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతో దశాబ్ధాల అనుబంధం ఉందని, ఆయన కొత్త పార్టీ  పెట్టడమనేది ఊహజనితమేనని మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో విభజన బిల్లుపై చర్చ జరగాల్సిందేనని మంత్రి కొండ్రు మురళి డిమాండ్ చేశారు.

విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుంటే విభజనకు అనుకూలమని కేంద్రం భావిస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సమైక్య తీర్మానం కోసం పట్టుబతామని కొండ్రు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడినా పార్టీకి వచ్చే నష్టమేమి లేదని  ఆయన తెలిపారు.  పార్టీని కాపాడటానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం పటిష్టంగా  ఉందని మంత్రి కొండ్రు మురళి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement