అమరవీరుల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణను ఇక ఆ దేవుడు కూడా ఆపలేడని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు స్పష్టంచేశారు.
కొల్లాపూర్/మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: అమరవీరుల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణను ఇక ఆ దేవుడు కూడా ఆపలేడని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు స్పష్టంచేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో జరిగిన పార్టీ శిక్షణ తరగతులకు కేకేతో పాటు మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. కేకే మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తమ ఆస్తులను కాపాడుకునేందుకు అనేక నాటకాలాడుతూ తెలంగాణ ఏర్పాటుకు మొకాలడ్డుతున్నారన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ ఇవ్వకుంటే మరో విడత పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తేలేదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి తేల్చిచెప్పారు.