రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో కేంద్రం పాత్ర లేదు

Nityanand Rai Comments On State Capital - Sakshi

టీడీపీ ఎంపీ కేశినేని ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటన

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్ర హోంశాఖ పునరుద్ఘాటించింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మంగళవారం సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర రాజధాని ఎంపికలో నిర్దిష్ట విధాన ప్రక్రియ ఏదైనా ఉందా? ఉంటే ఆ వివరాలు ఇవ్వండి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు తమ రాజధానులను ఎంపిక చేసుకున్న పద్ధతిని వివరించండి.

ఈ ఎంపికలో కేంద్రం ఏదైనా పాత్ర పోషించగలదా? పోషించగలిగితే వివరాలు ఇవ్వండి..’ అంటూ కేశినేని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ‘ఒక రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పునరుద్ఘాటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top