బాబు ‘ఛార్లెస్‌ శోభరాజ్‌’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు | Kesineni Nani Fires On Kesineni Chinni Over Cases On Him And URSA Clusters Land Scam, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబు ‘చార్లెస్ శోభ రాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Apr 27 2025 9:16 AM | Updated on Apr 27 2025 12:23 PM

Kesineni Nani Fires On Kesineni Chinni

సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో  తనని అరెస్ట్‌ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్‌ శోభరాజ్‌’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు.

 

 

నా పోరాటం ఆగదు
అంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్‌ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement