లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ

NIA Questioned Accused In YS Jagan Knife Attack Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం హైదరాబాద్‌లో విచారించారు. న్యాయవాదుల సమక్షంలో అతడిని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ డీఐజీ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగింది. నిందితుడి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు.

వైఎస్‌ జగన్‌పై దాడి ఎందుకు చేశావు, దాడి వెనుక ఎవరున్నారనే దానిపై లోతుగా విచారించారు. శ్రీనివాసరావు కాల్‌ డేటాను పరిశీలించి, దీనిపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. నేటితో నిందితుడి మూడో రోజు కస్టడీ ముగిసింది. క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా రేపు మరోసారి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకెళ్లి విచారించే అవకాశముందని తెలుస్తోంది.

నిందితుడిని వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం అతడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విశాఖపట్నంలో అతడిని విచారించారు. (శ్రీనివాసరావుపై ఎన్‌ఐఏ ప్రశ్నల వర్షం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top