రేణువు కూడా బరువే! | next two months no reach the sand auctions | Sakshi
Sakshi News home page

రేణువు కూడా బరువే!

Dec 13 2013 12:28 AM | Updated on Aug 28 2018 8:41 PM

కొత్త సంవత్సరంలో కానీ ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కనీసం మరో రెండు నెలల పాటు ఇసుక కష్టాలు తప్పేటట్టు లేవు.

సాక్షి, కాకినాడ :  కొత్త సంవత్సరంలో కానీ ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కనీసం మరో రెండు నెలల పాటు ఇసుక కష్టాలు తప్పేటట్టు లేవు. ఇసుక నిల్వల విక్రయాలకు సైతం గడువు ముగియనుంది. దీంతో  ఇసుక దొరకడమే గగనంగా మారనుంది. రాత్రి వేళల్లో గోదావరి గర్భాన్ని డొల్ల చేస్తున్న అక్రమార్కుల పుణ్యమాని ఒకవేళ దొరికినా యూనిట్ (మూడు ఘనపు మీటర్లు అంటే దాదాపు ఓ ట్రాక్టర్ లోడు) ఇసుక రేటు రూ.ఐదువేలకు పెరగనుంది. సంపన్నుల సంగతేమో కానీ, సామాన్యులు ఒంటి ఇటుక గోడతో ఒక్క గది కట్టుకోవాలన్నా భారంగా మారనుంది.
 జిల్లాలో 28 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, అమ్మకాలకు గడువు ముగిసి చాలా కాలమైంది. వీటిలో కొన్నింటిని లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినా వ్యవహారం కోర్టుకు చేరడంతో నిలిచిపోయింది.

మరో పక్క ఇసుక నిల్వల అమ్మరానికి ఇచ్చిన గడువు కూడా సమీపిస్తోంది. కపిలేశ్వరపురం, కోరుమిల్లిల వద్ద ఉన్న నిల్వల అమ్మకాలకు శనివారం గడువు ముగియనుండగా, వంగలపూడి వద్ద ఉన్న నిల్వలకు వచ్చే ఫిబ్రవరి వరకు, వేమగిరి వద్ద ఉన్న నిల్వలకు వచ్చే మే వరకు గడువుంది. కాగా లీజు ముగిసి, పర్యావరణ అనుమతులున్న ఇసుక రీచ్‌లను ప్రభుత్వ పాలసీకనుగుణంగా కేటాయింపులు జరపాలని హైకోర్టు రెండు నెలల క్రితం ఆదేశించింది. గత డ్వామా పీడీ అలసత్వం, సమైక్యాంధ్ర ఉద్యమంతో సరిహద్దుల గుర్తింపు, మైనింగ్ అనుమతులు పొందడంలో తీవ్రజాప్యం జరిగింది. ఇప్పటి వరకు కొండుకుదురు, టేకిశెట్టిపాలెం, దిండి, బో డసకుర్రు, కొత్తపేట-కేదార్లంక, గోపాలపురం రీచ్‌లకు మైనింగ్ అనుమతులు ల భించాయి.

పెదపట్నం-అప్పనపల్లి, పాశర్లపూడి, సోంపల్లి, అంకంపాలెం, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, వేమగిరి, ముగ్గళ్ల, కోటిపల్లి రీచ్‌లకు సం బంధించి మైనింగ్ అనుమతుల కోసం పంపారు. మిగిలిన ఊబలంక, ఇంజరం, పిల్లంక, ఎదుర్లంక, గుత్తెనదీవి, మందపల్లి, అయినవిల్లిలంక-వీరవల్లిపాలెం, జొన్నాడ, రాజమండ్రి, పశువుల్లంక, కేశనకుర్రు రీచ్‌లు ఇంకా మైనింగ్ ప్లాన్‌ల తయారీ దశలోనే ఉన్నాయి. మైనింగ్ అనుమతులున్న రీచ్‌లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)పరిధిలోని స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అయితే పీసీబీకి రాష్ర్ట స్థాయిలో పాలకమండలి లేకపోవడంతో అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది.
 కేంద్రం తాత్సారం : పీసీబీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం కోరినా కేంద్రం కొన్ని నెలలుగా జాప్యం చేస్తోంది. ఈ కారణంగానే రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గడువు ముగిసిన రీచ్‌లకు పర్యావరణ అనుమతుల మంజూరు లభించలేదు. కొత్త పాలకమండలి ఏర్పాటుకు నెల రోజులకు పైగా  పడుతుందని, ఆ తర్వాత మ రో నెల రోజులకు కానీ మైనింగ్ అ నుమతులు ఉన్న రీచ్‌లకు అనుమతి లభించదని అంటున్నారు. కాగా  ప ర్యావరణ అనుమతులొచ్చాక పారదర్శకతతో ప్రభుత్వ విధానానికనుగుణంగా రీచ్‌లు కేటాయిస్తామని కొ త్తగా బాధ్యతలు స్వీకరించిన డ్వా మా పీడీ సంపత్‌కుమార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement