జగన్‌ వస్తేనే బీసీలకు భరోసా | Next CM YS Jagan Mohan Reddy Kurnool | Sakshi
Sakshi News home page

జగన్‌ వస్తేనే బీసీలకు భరోసా

Jul 14 2018 7:11 AM | Updated on Aug 20 2018 6:07 PM

Next CM YS Jagan Mohan Reddy Kurnool - Sakshi

మాట్లాడుతున్న  శివశంకర్‌ నాయుడు

బండిఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు భరోసా ఉంటుందని పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగోలు శివశంకర్‌నాయుడు అన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బండిఆత్మకూరు మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వెలుగోడు, బండిఆత్మకూరు మండలాలకు చెందిన బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌నాయుడు మాట్లాడుతూ బీసీల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

గత ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీలుగా, రజకులు, యాదవులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశారని, అందరికీ న్యాయం చేసేందుకు దృడసంకల్పంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల సమస్యలను తెలుసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీల ప్రతినిధులు పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.
 
15 తర్వాత బీసీ సంఘాలతో సమీక్ష.. 
వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 15 తర్వాత పార్లమెంట్‌ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు శివశంకర్‌ నాయుడు తెలిపారు. ఏ చర్యలు తీసుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందో చెబితే వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్, మల్లేశ్వర్, పుల్లారెడ్డి, పాలరాముడు, బాబు, తిరుపతయ్య, శివ, ఉమ్మడి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, గోపాల్, సంపంగి శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement