పెయిడ్ ఆర్టికల్స్‌తో పత్రికలు కలుషితం | Newspapers pollutes with Paid articles | Sakshi
Sakshi News home page

పెయిడ్ ఆర్టికల్స్‌తో పత్రికలు కలుషితం

Jan 22 2014 2:40 AM | Updated on Mar 28 2019 5:39 PM

చెల్లింపు వార్తలతో పత్రికా రంగం కలుషితం అవుతోందని ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: చెల్లింపు వార్తలతో పత్రికా రంగం కలుషితం అవుతోందని ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ది పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ‘జాతీయ అభివృద్ధి- ప్రజా సంబంధాలు, పాత్రికేయుల పాత్ర’పై చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. పెద్ద పత్రికలే ఈ అనైతిక చర్యకు పాల్పడుతున్నాయన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, పార్టీల అధిపతుల చేతుల్లోకి మీడియా వెళ్తుండటం పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. కార్యక్రమంలో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్, పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్  నరసింహరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీ ఆవిష్కరణ
 ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ఆవిష్కరించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement