breaking news
K. srinivas reddy
-
పంటల సాగులో మెలకువలు పాటించాలి
‘ఫోన్‌ఇన్’లో ఏఓ శ్రీనివాస్‌రెడ్డి కల్హేర్: పంట సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని కల్హేర్ మండల వ్యవసాయధికారి కె.శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో రైతులతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో అన్నదాతలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పి, సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: సోయాలో కలుపును ఎలా నివారించాలి: మల్దోడ్డి రాములు, కృష్ణపూర్ ఏఓ: 250 మిల్లీలీటర్ల క్విజోనోపాప్ఇతల్, ఫైరిత్రోబాక్ సోడియం మందులను కలిపి లీటర్ నీటిలో 2 ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ప్రశ్న: మక్కజొన్న శేను ఎర్రగా మారుతుంది. ఏం చేయాలి: వడ్డె కిష్టాయ్య, ఇందిరానగర్ జవాబు: లీటర్ నీటిలో 2 గ్రాముల యూరియా కలిపి పంటపై పిచికారీ చేయండి. ప్రశ్న: సోయా పంటకు ఆకుముడత వస్తోంది: చింతల నారాయణ, మార్డి జవాబు: లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి స్ప్రే చేయాలి. ప్రశ్న: కల్హేర్‌లో యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారు: హన్మంత్‌రావు, కల్హేర్ జవాబు: అధిక ధరకు యూరియా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: సోయాలో పూత రాలుతోంది. ఏం చేయాలి: రాఘవరెడ్డి, కడ్పల్ జవాబు: లీటర్ నీటిలో 4 ఎంఎల్ ప్లానోఫిక్స్ మందును కలిపి స్ప్రే చేస్తే పూత రాలదు. ప్రశ్న: కడ్పల్లో 2011 నుంచి 2014 వరకు రైతులకు అందజేసిన పంట నష్ట పరిహారం వివరాలివ్వండి: రాంరెడ్డి, కడ్పల్ జవాబు: వారం రోజుల తర్వాత పంట నష్ట పరిహారం చెల్లింపు వివరాలు ఇస్తాం. ప్రశ్న: వరిలో తాటాకు తెగులు నివారణ చర్యలు చెప్పండి: పోతిరెడ్డి, మాసాన్‌పల్లి జవాబు: నాలుగు కిలోల ఫర్టెర గుళికలు, 4 గ్రాముల క్లోరంత్రోనోప్రోనిల్ను కలిపి పొలంలో చల్లుకోవాలి. ప్రశ్న: మార్డిలో రైతులకు అందజేసిన ఇన్పుట్ సబ్సిడీ వివరాలివ్వండి: సంగమేశ్వర్, మార్డి జవాబు: వారం రోజుల తర్వాత ఇస్తాం. ప్రశ్న: జింక్, చౌడ్ నివారణకు చర్యలు చెప్పండి: గోపీనాయక్, మార్డితండా జవాబు: జింక్ లోపం కోసం 2 గ్రాముల స్వర్ణపల్, 2 గ్రాముల అన్నబేరిని స్ప్రే చేయాలి. చౌడ్ నివారణకు ఎకరాకు 200 కిలోలు జిప్సం వేయాలి. ప్రశ్న: సబ్సిడీపై శనగలు కావాలి: మల్లయ్య, రాంరెడ్డిపేట జవాబు: శనగలు వచ్చిన వెంటనే సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తాం. ప్రశ్న: పత్తిలో రసం పీల్చే పురుగును ఎలా నివారించాలి: అంజయ్య, ముబారక్పూర్ జవాబు: 10 లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇండక్లోరిఫైడ్ 17.8ఎస్ఎల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 500 గ్రాముల ఎసిపేట్ వేయాలి. ప్రశ్న: వరి పైరులో మొగిపురుగు నివారణ చర్యలు ఎమిటి: లక్ష్మణ్, ఖానాపూర్(కె) జవాబు: నాలుగు కిలోల ఇసుకలో 4 గ్రాముల క్లోరంత్రోనోప్రోనిల్ను కలిపి పొలంలో వేయాలి. సోయాచిక్కుడులో ఆకుపచ్చ పురుగు ప్రశ్న: సోయాచిక్కుడు పంటలో ఆకుపై పచ్చరంగులో ఉన్న పురుగులు కనిపిస్తున్నాయి. ఇవి చెట్టు ఆకులను తింటూ రంధ్రాలు చేస్తున్నాయి. వీటి నివారణకు ఏంచేయాలో చెప్పండి. - భూమయ్య, వెల్మకన్న, సెల్: 9000742690 జవాబు: మీరు సాగు చేసిన పంటకు పచ్చపురుగు సోకింది. దీని ప్రభావంతో మొక్క ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గిపోతుంది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగును మొదటి దశలోనే గుర్తించడం వల్ల పూర్తిగా నివారించవచ్చు. 200 లీటర్ల నీటిలో 320 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ కలిపి ఎకరా చేనులో పిచికారీ చేయాలి. - రాజు, ఏఓ కౌడిపల్లి, సెల్: 8886612478 -
పెయిడ్ ఆర్టికల్స్‌తో పత్రికలు కలుషితం
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: చెల్లింపు వార్తలతో పత్రికా రంగం కలుషితం అవుతోందని ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ది పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ‘జాతీయ అభివృద్ధి- ప్రజా సంబంధాలు, పాత్రికేయుల పాత్ర’పై చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. పెద్ద పత్రికలే ఈ అనైతిక చర్యకు పాల్పడుతున్నాయన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, పార్టీల అధిపతుల చేతుల్లోకి మీడియా వెళ్తుండటం పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. కార్యక్రమంలో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్, పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ నరసింహరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీ ఆవిష్కరణ ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ఆవిష్కరించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.