జిల్లాకు నూతన ప్రధాన న్యాయమూర్తి

New Chief Judge Appointed For Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గుట్టల గోపి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి జిల్లా జడ్జి ఇ.భీమారావు నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్‌ను కర్నూలు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన గోపిని అదనపు జిల్లా న్యాయమూర్తులు వై.హేమలత, ఇ.భీమారావు, ఇతర న్యాయమూర్తులు రాంబాబు, లక్ష్మీరాజ్యం ఆయన ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు టి.వి.శ్రీనివాసరావు, కార్యదర్శి టి.బ్రహ్మాజీ, సంయుక్త కార్యదర్శి వై.హరికృష్ణ, కోశాధికారి జి.రాంబాబు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి న్యాయవాదుల సంఘ భవనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top