సింహపురిగా ఇక నెల్లూరు | Nellore name turns into Simhapuri, says Venkaiah naidu | Sakshi
Sakshi News home page

సింహపురిగా ఇక నెల్లూరు

Nov 15 2014 12:36 PM | Updated on Oct 20 2018 6:19 PM

సింహపురిగా ఇక నెల్లూరు - Sakshi

సింహపురిగా ఇక నెల్లూరు

నెల్లూరు పేరు సింహపురిగా మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు.

నెల్లూరు: నెల్లూరు పేరు సింహపురిగా మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. శనివారం నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్లో సర్థార్ వల్లభాయ్పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగర అభివృద్దికి సహకరించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణను అడ్డుకోవద్దని సూచించారు. అందరు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement