ఆలయ భద్రత ‘గోవిందా’

ఆలయ భద్రత ‘గోవిందా’ - Sakshi


- సెల్‌ఫోన్లు, కెమెరాలతో  ఆలయంలోకి అనుమతి

- తూతూమంత్రంగా సిబ్బంది తనిఖీలు

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ యంత్రాంగం

చంద్రగిరి :
ఏడు లోకాలను రక్షించే ఏడుకొండల వాడికి రక్షణ కరువైంది. శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అటువంటి ఆలయానికి భద్రత విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నారాయణవనంలో శ్రీవారు పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు.అనంతరం దేవేరులు తిరుమలకు పయనమౌతారు. అయితే తొం డవాడ స్వర్ణముఖినది ఒడ్డున వెలసిన శ్రీఅగస్త్య మహాముని  వివాహానంతరం దేవేరులు తిరుమలకు వెళ్లడం మంచిదికాదని వివరిస్తారు. దానికి అణుగుణంగా శ్రీనివాసుడు అమ్మవారితో కలసి ఆరు నెలల కాలం పాటు శ్రీనివాస మంగాపురంలో నివ శించాడని అందుకే ఆ గ్రామం శ్రీనివాస మం గాపురంగా నిలిచిందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా భక్తులు తిరుమలలో నిర్వహించలేనటువంటి సేవలను మంగాపురాలయంలో నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.తిరుమలకు కాలినడకన చేరుకోవడానికి శ్రీవారి మొట్టుదారి దగ్గరవడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీనివాస మంగాపురం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంపై టీటీడీ అధికారులు శీత కన్ను వేశారు. శ్రీనివాస మంగాపురంలోని స్వామివారిని దర్శిం చుకోవడానికి వస్తున్న భక్తులకు కనీస అవసరాలను తీర్చడంలో టీటీడీ పూర్తి గా వైఫల్యం చెందిదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు రోజుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయ పరిసరాలలో ఎక్కడాకాని లగేజి కౌంటర్ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేమిలేక భక్తులు తమ లగేజీతోపాటే ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు.ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు నిషేధమని అధికారులకు తెలిసినా కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నా రు. సిబ్బంది సైతం భక్తులకు సూచనలు ఇస్తున్నారే తప్ప వారిని తనిఖీ చేసిన దాఖలు లేవు. దీంతో  భక్తులు ఆలయంలోకి సెల్‌ఫోన్లు, వీడి యో కెమెరాలతో ప్రవేశిస్తున్నారు. భక్తులు అలయంలో ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తుండటంతో తోటి భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని తిరుమల తరహాలో ఆలయ సమీపం లో సెల్ ఫోన్, లగేజి కౌంటర్ల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top