‘నీట్‌ దరఖాస్తు’ తప్పుల తడక | "NEET application" was full of mistakes | Sakshi
Sakshi News home page

‘నీట్‌ దరఖాస్తు’ తప్పుల తడక

Feb 8 2017 3:41 AM | Updated on Apr 3 2019 8:42 PM

‘నీట్‌ దరఖాస్తు’ తప్పుల తడక - Sakshi

‘నీట్‌ దరఖాస్తు’ తప్పుల తడక

మెడికల్‌ ప్రవేశాలకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబి లిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తు

సాక్షి, అమరావతి: మెడికల్‌ ప్రవేశాలకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబి లిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం తప్పుల తడకగా వచ్చింది. మే 7న ప్రవేశ పరీక్ష జరగనుండటంతో ఆన్‌ౖ లెన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్ని స్తున్న అభ్యర్థులు ఏం చేయాలో తెలియక గగ్గోలు పెడుతున్నారు.

ఏపీ డీఎంఈకి తెలంగాణ మెయిల్‌ అడ్రస్‌
కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలు ఆయా రాష్ట్రాల మెడికల్‌ డైరెక్టరేట్‌ల్లో తెలుసు కోవచ్చని పేర్కొన్నారు. ఇందులో ఏపీ మెడికల్‌ డైరెక్టరేట్‌ కోఠి సుల్తాన్‌బజార్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈమెయిల్‌ చిరునా మా మాత్రం తెలంగాణ డీఎంఈది ఇచ్చారు. కానీ ఈ కార్యాలయాన్ని ఆరు నెలల క్రితమే విజయవాడలో ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి లక్షద్వీప్‌ వరకూ అన్ని రాష్ట్రాల మెడికల్‌ డైరెక్టరే ట్‌ల చిరునామాలు ఇచ్చారు. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కార్యాలయం వివరాలే ఇవ్వలేదు.

రిజర్వేషన్‌ కేటగిరీలోనూ స్పష్టత లేదు
ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ అనే విషయం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. కానీ జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి వీళ్లు ఓబీసీ కోటాలో దరఖాస్తు చేసుకో వాలా? జనరల్‌ కోటాలోనా అనేది స్పష్టత లేదు. దరఖాస్తు చేసుకునే సమయంలో అక్కడ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ కాలంలో పొందుపరచాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏ సమాచారం టిక్‌ చేయాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా జాతీయ కోటాలో లేని జమ్ము కశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంలోనూ సరైన స్పష్టత లేదని, ఈ వివరాల్లోకి వెళితే దేనిపై టిక్‌ చేయాలో అర్థం కావడం లేదని, అంతా గందరగోళంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement