‘కర్నూల్లో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’ | " need to set up a neet test center in kurnool ' | Sakshi
Sakshi News home page

‘కర్నూల్లో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’

Apr 12 2017 7:22 PM | Updated on Oct 20 2018 5:44 PM

‘కర్నూల్లో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’ - Sakshi

‘కర్నూల్లో నీట్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి’

నీట్‌–2017 పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయకారిగా ఉండేందుకు కర్నూలులో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక జేపీ నడ్డాను కోరారు.

– జేపీ నడ్డాకు ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి

న్యూఢిల్లీ: నీట్‌–2017 పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయకారిగా ఉండేందుకు కర్నూలులో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కోరారు. రాష్ట్రంలో గుంటూరు, వైజాగ్, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నప్పటికీ అవన్నీ 300 కి.మీ.పైబడి దూరంలో ఉన్నాయని వివరించారు.

కాగా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ బుట్టా రేణుక దంపతులు పార్లమెంటులో స్పీకర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement