ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు | National awards to three telugu medical officers | Sakshi
Sakshi News home page

ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు

May 13 2017 2:18 AM | Updated on Oct 9 2018 7:11 PM

ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు - Sakshi

ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నర్సులకు 2017 ఏడాదికిగానూ జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు దక్కాయి.

సాక్షి, న్యూఢిల్లీ/రేపల్లె: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నర్సులకు 2017 ఏడాదికిగానూ జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా  వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అవార్డులు అందుకున్నారు.

కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సమన్వయ అధికారిణి మాదెల్ల ఎంహెచ్‌. ప్రమీలాదేవి, గుంటూరు జిల్లా కనగల్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న గోవిందమ్మ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి చింతపల్లికి చెందిన దున్న జయ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement