రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన | Nadikudi-Srikalahasti railway line | Sakshi
Sakshi News home page

రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన

Mar 10 2016 4:03 AM | Updated on Sep 3 2017 7:21 PM

రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన

రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే చేసిన అటవీ భూములను రైల్వే-అటవీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా...

వింజమూరు: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే చేసిన అటవీ భూములను రైల్వే-అటవీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. వింజమూరు, కాటేపల్లి, డక్కనూరు, రాజోలు తదితర ప్రాంతాల్లో రైల్వేలైన్ కోసం సర్వే చేసిన భూములను కావలి సబ్‌డివిజన్ డీఎఫ్‌ఓ సీహెచ్ నాగభూషణం, రైల్వే సీనియర్ ఇంజినీరు సీహెచ్ సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీహెచ్ నాగభూషణం మాట్లాడుతూ 97.2 హెక్టార్లలో అటవీ భూములు రైల్వే శాఖకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రైల్వే లైను నిడివి 308.7 కిలోమీటర్లు కాగా మన జిల్లాలో 145 కిలోమీటర్లు లైను ఏర్పాటవుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 110 కి.మీ, మిగిలినది గుంటూరు జిల్లాలో ఉందన్నారు. మొత్తం బడ్జెట్‌లో రూ.800 కోట్లు భూముల నష్ట పరిహారం కోసం కేటాయించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement