
ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంటులోకి వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ చప్పట్లు కూడా కొట్టారని..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కే సింగ్.. పునర్విభజన చట్టంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్ధ ఉండేదన్నారు. కానీ ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్ధ అనేదే లేదని తెలిపారు. గతంలో విభజన చట్టం అమలుకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ బాధ్యులుగా ఉండేవారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంటులోకి వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ చప్పట్లు కూడా కొట్టారని అన్నారు.
ప్రత్యేక హోదా అమలు విషయంపై ఎన్డీసీదే బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్దిక సంఘం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేందుకు 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపిందన్నారు.