ఈనెల 11న తెనాలిలో పౌరాణిక పద్య పోటీలు నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత డాక్టర్ వి.ఆర్.రాసాని రూపొందించిన ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు పుస్తకాన్ని ఈనెల 11న తెనాలిలో ఆవిష్కరించనున్నట్లు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జానీబాషా, ఎం.సత్యనారాయణశెట్టి చెప్పారు. తెనాలిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అదేరోజు ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రస్థాయి పౌరాణిక పద్య పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పౌరాణిక నటుడు ఉప్పాల నాంచారయ్యను సత్కరిస్తామని చెప్పారు.