అంతుచిక్కని వ్యాధితో యువతి మృతి | Mysterious disease that killed woman | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని వ్యాధితో యువతి మృతి

Jul 20 2014 1:07 AM | Updated on Sep 2 2017 10:33 AM

అంతుచిక్కని వ్యాధితో యువతి మృతి

అంతుచిక్కని వ్యాధితో యువతి మృతి

స్థానిక ఆగూరు వీధికి చెందిన ఆగూరు కుమారి (21) అనే వి ద్యార్థిని అంతుచిక్కని వ్యాధితో శనివారం మృతి చెందింది. ఇరవై రోజు లుగా ఆమెను కుటుంబ సభ్యులు

 మక్కువ : స్థానిక ఆగూరు వీధికి చెందిన ఆగూరు కుమారి (21) అనే వి ద్యార్థిని అంతుచిక్కని వ్యాధితో శనివారం మృతి చెందింది. ఇరవై రోజు లుగా ఆమెను కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కుమారికి కొద్దిరోజుల కిందట జ్వరం రావడంతో ఆమెకు స్థానిక ప్రైవేటు వైద్యుడు (ఆర్‌ఎంపీ) వారం రోజులు పాటు వైద్యసేవలందించారు. అయితే ఆరోగ్యం బాగుపడకపోవడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి పార్వతీపురంలోనే ఓ ప్రై వేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి రాజాం జీఎం ఆర్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఎ క్కడా ఆమెకు నయం కాలేదు. దీంతో మెరుగైన వైద్యసేవల కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారం కిందట తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందుతూ శనివారం ఈ విద్యార్థిని మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారి పార్వతీపురం మండలం మరిపివలస సమీపంలో ఉన్న కళాశాలలో బీఈడీ విద్యార్థిని. ముగ్గురు కుమార్తెల్లో ఈమె రెండో కుమార్తె. తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీరాములు గుండెలవిసేలా రోదించారు.
 
 సెరిబ్రల్ మలేరియాతోనేనా..?
 కుమారి సెరిబ్రల్ మలేరియాతో మరణించినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో మలేరియా వ్యాధికి సంబంధించిన మందులు అందించినా కుమారికి నయం కాలేదు. విశాఖపట్నానికి చెందిన వైద్యాధికారులు టెస్ట్‌లు, స్కానింగ్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించ లేదు. వైద్యాధికారులు ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ చేసినా రిజల్ట్ రాకముందే కుమారి మృతి చెందడంతో వెంటనే విశాఖపట్నం నుంచి గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో ఆమెకు ఏ వ్యాధి సోకిందో కుటుంబసభ్యులకు కూడా తెలీకుండా పోయింది. అయితే సెరిబ్రల్ మలేరియా, బ్రెయిన్ ట్యూమర్ సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement