తాను కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యనభ్యసించానని రాష్ట్ర వైద్యవిద్య, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు
కడియం : తాను కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యనభ్యసించానని రాష్ట్ర వైద్యవిద్య, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు కుమారుడు కిరణ్, నర్సరీ రైతు మార్గాని వీరబాబు కుమార్తె గౌతమిల నిశ్చితార్ధ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు రాజకీయ ప్రముఖులు జిల్లాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఈ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానమని మంత్రి కామినేని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తూర్పుగోదావరిజిల్లాలోనే పుట్టిన తనకు ఈ జిల్లాతో విడదీయలేని బంధముందన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం,ఆప్యాయతను పంచే ఈ జిల్లాతో బంధుత్వం కలవడం ఆనందంగా ఉందన్నారు.