వివాహేతర సంబంధమే అని తేల్చిన సీఐ | Murder with Illegal relation | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే అని తేల్చిన సీఐ

May 14 2015 7:13 PM | Updated on Sep 3 2017 2:02 AM

భీమేష్ మృతదేహం

భీమేష్ మృతదేహం

మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం సర్పంచ్‌ షేక్‌ బీబీ భర్త భీమేష్ హత్య కేసును చోడవం సీఐ కిరణ్ కుమార్ చేధించారు.

విశాఖపట్నం: మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం సర్పంచ్‌ షేక్‌ బీబీ భర్త భీమేష్ హత్య కేసును చోడవం సీఐ కిరణ్ కుమార్ చేధించారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.  గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీ తరపున భీమేష్ భార్య  బీబీ గెలుపొందారు. వృత్తి రీత్యా మాంసం వ్యాపారి అయిన భీమేష్ వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీలో చురుకైన పాత్ర పోషించే వారు.

అతనికి చాలా కాలంగా గ్రామంలోని ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంబంధం కారణంగానే అతనిని హత్య చేసి మృతదేహాన్ని పెద్దేరు కాలువ వద్ద పడవేసినట్లు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement