అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య

Published Thu, Sep 7 2017 8:28 PM

అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ సిటీ:  కట్టుకున్న భార్యకు అన్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవమానభారంతో తాను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందని భయపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. కుషాయిగూడ, గణేష్‌నగర్‌ కాలనీలో వెల్డింగ్‌ పని చేస్తూ జీవనం సాగించే రాజేష్‌(30)కు రాజమణితో వివాహం జరిగింది. అయినా రాజేష్‌ ఓమహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య రాజమణి, భర్తను నిలదీసింది. బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త తీరుపై ఫిర్యాదు చేసింది. దీంతో పరువు పోతుందని భావించిన రాజేష్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్లగా సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement