తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బి.రాము అస్వస్థతకు గురయ్యారు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బి.రాము అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలో
మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కమిషనర్ రాము సమావేశం అనంతరం స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.