నేటి నుంచి పాదయాత్ర
పోలీసులు విధించిన గృహ నిర్బంధం బుధవారంతో ముగిసిందని, గురువారం నుంచి పాదయాత్ర జరిగి తీరుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.
శాంతియుతంగా తరలిరావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పిలుపు
కిర్లంపూడి (జగ్గంపేట): పోలీసులు విధించిన గృహ నిర్బంధం బుధవారంతో ముగిసిందని, గురువారం నుంచి పాదయాత్ర జరిగి తీరుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కాపు నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో కాపు నాయకులతో కలసి ముద్రగడ బుధవారం కూడా ‘కంచాల మోత’ కార్యక్రమం కొనసాగించారు.